ఈనెల 23 నుంచి వార్డు సభ్యులకు శిక్షణ

ఈనెల 23 నుంచి వార్డు సభ్యులకు శిక్షణ

JGL: పెగడపల్లి మండలంలోని వార్డు సభ్యులకు ఈ నెల 23 నుంచి 26 వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శశికుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 216 మంది సభ్యులకు గాను, తొలి విడతలో 110 మందికి ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన సభ్యులందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.