'హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలి'

'హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలి'

ASR: జీ.మాడుగుల మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. సమావేశానికి అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో, బహిష్కరించామని వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం తెలిపారు. ప్రతి 3నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడం సరికాదన్నారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.