'జనసేన బలోపేతానికి కృషి చేయాలి'
SKLM: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన బలోపేతానికి జనసేన సైనికులు పనిచేయాలని సూడా ఛైర్మన్ కోరికన రవికుమార్ పాతపట్నం జనసేన నాయకురాలు కోరికన భవాని కోరారు. గురువారం మెలియాపుట్టి ఓ కళ్యాణ మండపంలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జన సైనికులు పనిచేయాలన్నారు.