కన్నుల పండుగ భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులకు ఇవాళ నిత్య కళ్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అలాగే అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.