రైల్వే అండర్ బ్రిడ్జిలోకి వరద నీరు
KMM: కామేపల్లి మండలం గరిడేపల్లి రైల్వే గేట్ వద్ద అండర్ బిడ్జిలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. విరామం లేకుండా కురిసిన భారీ వర్షంతో భారీగా వరద నీరు రావడంతో శనివారం ఉదయం నుంచి ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అండర్ బిడ్జిలోకి వరద చేరడంతో ఇటు గరిడేపల్లి వాసులు అటు రైతులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.