'ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'
KMM: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు హెచ్చరించారు. కామేపల్లి మండలం పింజరమడుగు, నెమలిపురి గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులతో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని వారు నాయకులను కోరారు.