పింఛన్లు అందజేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని 20వ డివిజన్ వనంతోపులో శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్ల నగదు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.