పెద్దేముల్ లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

పెద్దేముల్ లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

వికరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెద్దేముల్ మండలంలోని 9 క్లస్టర్లలో నామినేషన్ దాఖలు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దేముల్ మేజర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మొదలైంది. ఇందులో మండల ఎంపీడీఓ రతన్ సింగ్, రిటర్నింగ్ అధికారులు శివకుమార్, శివ ప్రసాద్, పెద్దేముల్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లాలప్ప, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.