గొల్లప్రోలులో వీఆర్వోలు నిరసన
KKD: గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోలు నిరసన రెండో రోజు చేరుకుంది. వీఆర్వోలకి రాత్రి పగలు తేడా లేకుండా సెలవు రోజుల్లో కూడా పని చెప్పడం వల్ల పని ఒత్తిడి పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పని భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరసన చేపడుతున్నట్లు వీఆర్వోలు శేఖర్, చంటి తదితరులు తెలియజేశారు.