రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

HNK: భీమదేవరపల్లిలో శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి మైలు రాయిని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను MGM ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరు సిద్ధిపేట జిల్లా పోతారం S గ్రామస్థులుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.