కలెక్టర్ చేతుల మీదుగా కారుణ్య నియామకాలు
నెల్లూరు: కారుణ్య నియామకం ద్వారా నలుగురికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఉత్తర్వులను అందించారు. తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ శాఖలలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా నలుగురికి ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అందించారు.