జానకి కుటుంబానికి ఎంఆర్పీఎస్ పరామర్శ
KRNL: కౌతాళం మండలం ఎరిగేరిలో అత్యాచారం, హత్యకు గురైన మాదిగ జానకి కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా బృందం గురువారం పరామర్శించింది. జిల్లా అధికార ప్రతినిధి హనుమంతు నేతృత్వంలో బాధితులతో సమావేశమై ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.