సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీ

సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీ

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని కాజీపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఖాళీగా ఉన్న భవనాలను ఎంపీ కడియం కావ్య జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. నగరంలోని కేంద్ర ప్రభుత్వ పింఛన్ దారులకు సరైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ మంజూరు చేసింది. కలెక్టర్ స్నేహ శబరిష్‌తో కలిసి భవనాల పరిస్థితిని సమీక్షించారు.