భారత్‌లో నెల జీతం.. అక్కడ ఒక్క రోజులోనే!
భారత్‌లో నెల సంపాదనను ఆస్ట్రేలియాలో ఒక్క రోజులోనే సంపాదిస్తున్నానంటూ ఓ భారతీయుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో ఉంటున్న రవీందర్, తాను అక్కడ రోజుకు రూ. 46 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. అదే భారత్‌లో అయితే ఇది తన నెల జీతమని పేర్కొన్నాడు. కష్టపడితే విదేశాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, యువత ఇలాంటి అవకాశాలను అందుకోవాలని పిలుపునిచ్చాడు.