మొదటి విడత పంచాయతీలకు బ్యాలెట్ పేపర్ల కేటాయింపు

మొదటి విడత పంచాయతీలకు బ్యాలెట్ పేపర్ల కేటాయింపు

MLG: జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న మూడు మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికల అధికారులు బ్యాలెట్ పేపర్లను కేటాయిస్తున్నారు. ఈనెల 11న గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తుదిపోరులో ఉండే అభ్యర్థుల జాబితా ఖరారు కాగా, వారికి గుర్తులు కేటాయించారు. ఇప్పటికే సిద్ధం చేసిన బ్యాలెట్ పత్రాలను పంచాయతీల వారీగా కేటాయింపు చేస్తున్నారు.