మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నిక
KMR: ఎల్లారెడ్డి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా సిద్ధి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి దిగంబర్ తెలిపారు. అధ్యక్షత పదవి కోసం శ్రీధర్, కిరణ్ నామినేషన్లు వేశారు. కిరణ్ ఉపసంహరణ చేసుకోవడంతో శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాలకిషన్ కార్యదర్శి సుదర్శన్ పాల్గొన్నారు.