జడ్పీ పాఠశాల విద్యార్థులకు అభినందన
SKLM: నరసన్నపేట మండలం కంబకాయ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్థానిక ఉపాధ్యాయులు అభినందించారు. సోమవారం హెచ్ఎం బమ్మిడి మన్మధరావు మాట్లాడుతూ.. ఇటీవల రాజ్యాంగ దినోత్సవం,గణిత ప్రతిభ పోటీలలో తమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు మండల స్థాయిలో ప్రధమ,ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారని వివరించారు. వీరంతా నియోజకవర్గస్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు.