కూటమి పార్టీ ఫ్లెక్సీలను చింపేసిన ఆకతాయిలు

కూటమి  పార్టీ ఫ్లెక్సీలను చింపేసిన ఆకతాయిలు

బాపట్ల: మున్నంవారిపాలెం ప్రాంతంలో ఏర్పాటుచేసిన కూటమి పార్టీ ఫ్లెక్సీలను కొందరు ఆకతాయిలు చింపివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన ఫ్లెక్సీని కేవలం మెడ భాగంలో నరికినట్లు చింపివేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.