'57వ ఉరుసు ఉత్సవ వేడుకలు జయప్రదం చేయండి'
ATP: రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న భం షేక్ అబ్దుల్ వహబ్ 57వ ఉరుసు ఉత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు. మార్చి 1వ తేదీన గంధం కార్యక్రమం, రెండవ తేదీన చిత్రపటం ఊరేగింపు, దీపారాధన, మూడవ తేదీన షంషీర్ బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వభక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.