ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఐడీ కార్డులు పంపిణీ
తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అవుట్‌డోర్, ఇండోర్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కమిషనర్ మౌర్య చేతుల మీదుగా కార్డులు అందజేశారు. గుర్తింపు కార్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఇది ఉపశమనం కలిగించింది. కమిషనర్ చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించబడగా, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.