వాడపల్లి వెంకన్న అన్నదాన ట్రస్ట్‌కు విరాళం అందజేత

వాడపల్లి వెంకన్న అన్నదాన ట్రస్ట్‌కు విరాళం అందజేత

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు మంగళవారం కొవ్వూరు వాస్తవ్యులు వైకర్న శేషగిరిరావు, పార్వతి దంపతులు వారి కుటుంబ సభ్యులు  రూ.50,116 విరాళం అందజేశారు.  ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. దాత కుటుంబానికి ఆయన స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు.