విఘ్నేశ్వరుని అన్న ప్రసాద ట్రస్ట్‌కు భారీ విరాళం

విఘ్నేశ్వరుని అన్న ప్రసాద  ట్రస్ట్‌కు భారీ విరాళం

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం తొత్తరమూడి పెదపాలెం గ్రామానికి చెందిన చిత్తూరి చాందిని గంగ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించి, అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళంగా రూ.50,001లు ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటం అందజేసారు.