ORR పరిధిలో 10 డిపోలు కావాలని కోరిన RTC
HYD: నగరంలో ప్రస్తుత ఆర్టీసీ డిపోలతో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మరో 10 డిపోలు అవసరమని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను రూపొందించారు. ఈ డిపోల నిర్మాణం, హై టెన్షన్ పవర్ కనెక్షన్ల కోసం సుమారు రూ. 292 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.