VIDEO: హాసన్బాదలో పిడుగుపాటుకు తాటాకు పాక దగ్ధం
కోనసీమ: రామచంద్రాపురం మండలం హాసన్బాదలో సోమవారం కురిసిన భారీ వర్షంలో పిడుగు పడి ఒక తాటాకు పాక పూర్తిగా దగ్ధమైంది. ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఎవరికీ ప్రాణహాని కలగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పిడుగుపాటు ధాటికి పాక కాలిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళన చెందారు.