తిరుమల నాథ స్వామిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న
NLG: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చీకటిమామిడి గ్రామంలోని శ్రీ తిరుమల నాథ స్వామిని TRP పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.