ముగిసిన రెండో విడత GP ఎన్నికల ప్రచారం

ముగిసిన రెండో విడత GP ఎన్నికల ప్రచారం

KMR: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. అయితే, ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 14 సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత గ్రామపంచాయతీల్లో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అధికారులకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.