మంత్రిని కలిసిన ఎస్పీ ధీరజ్
అన్నమయ్య: మదనపల్లిలో నిర్వహించనున్న జీరో పావర్టీ- P4 కార్యక్రమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాకు వచ్చిన ఇంఛార్జ్ మంత్రి జనార్ధన్‌ని జిల్లా ఎస్పీ ధీరజ్ రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, మంత్రి పర్యటనకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ వివరించారు.