మహిళ హత్య కేసులో దంపతుల అరెస్టు
ATP: గుత్తిలో గత నెల 26న మహిళ హత్య కేసులో దంపతులను అరెస్టు చేసినట్లు గుత్తి సీఐ రామారావు శనివారం మీడియాకు తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. బంగారు నగల కోసం ఇంటి ఓనర్ విజయలక్ష్మిని హత్య చేసిన కేసులో దంపతులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి జత కమ్మలు, ఒక సెల్ ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ముద్దాలను కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించామన్నారు.