VIDEO: నిరుద్యోగుల హామీలు నెరవేర్చాలి: వైసీపీ
KRNL: నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని YCP నేత కాటసాని నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలులో నిర్వహించిన 'యువత మేలుకో' కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్లపై యువత ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.