బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు
SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి కొమరవెల్లి మండల కేంద్రంలో పర్యటించి స్వామి వారి కళ్యాణం బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లు, వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.