మొరాయిస్తున్న సర్వర్.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

మొరాయిస్తున్న సర్వర్.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థులు కులం సర్టిఫికెట్ కోసం తాహసీల్దార్ కార్యాలయం వెళ్లగా ఉదయం నుంచి సర్వర్ మొరాయించడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి మ్యానువల్ క్యాస్ట్ సర్టిఫికెట్ అందించాల్సిందని కోరుతున్నారు.