భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

VZM: అనంతగిరి మండలం సరియాపల్లి గ్రామ పెద్దలు విజయనగరంలోని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజనుల భూములను గిరిజనేతరులు ఆక్రమించారని వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానని డీవీజీ హామీ ఇచ్చారు.