రాయికల్‌లో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు
JGL: రాయికల్ పట్టణంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై హైకోర్టు వెలువరించిన సానుకూల తీర్పును స్వాగతిస్తూ రాయికల్ బీఆర్ఎస్ నాయకులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకులు బర్కం మల్లేశ్, ఎలిగేటి అనిల్ పాల్గొన్నారు.