వందనం గ్రామంలో పెద్దపులి కలకలం

ఖమ్మం: జిల్లాలో చింతకాని మండలం వందనం గ్రామంలో పెద్దపులి సమాచారం కలకలం రేపింది. మొక్కజొన్న పొలానికి నీళ్లు కడుతుండగా చూశానని అంటున్న స్థానిక రైతు షేక్ గాలి సాహెబ్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు, చింతకాని పోలీసులు. రైతు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం..హైనా జాతికి చెందిన నక్కగా గుర్తించిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి వేణుమాధవ్ దానిని జూపార్కుకి తరలించారు.