బాధితులకు CMRF చెక్కులు పంపిణీ

బాధితులకు CMRF చెక్కులు పంపిణీ

BPT: వేమూరు ఎమ్మెల్యే ఆనంద బాబు చేతుల మీదుగా కొల్లూరు మండలానికి చెందిన 8 మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన వీరికి మొత్తం రూ.3,11,306 విలువైన సాయం అందింది. కొల్లూరు, చిలుమూరు, దోనేపూడి తదితర గ్రామాల లబ్ధిదారులు ఈ చెక్కులు అందుకున్నారు. ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.