రేపు బహిరంగ విచారణ
VZM: భూముల మ్యుటేషన్ చేయడానికి విజయనగరం మండల రెవెన్యూ కార్యాలయంలో లంచం అడుగుతున్నారన్న ఫిర్యాదులుపై మంగళవారం బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు కెఆర్ఆర్‌సి ప్రత్యేక ఉపకలెక్టర్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.11 గంటలకు మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగే ఈ విచారణకు రాకోడు, పరిసర గ్రామాల రైతులు తమవద్దనున్న ఆధారాలతో రావాలన్నారు.