వరుణుడి బీభత్సం.. స్తంభించిన ట్రాఫిక్

వరుణుడి బీభత్సం.. స్తంభించిన ట్రాఫిక్

HYD: నగరంలో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన GHMC సిబ్బంది, పోలీసులు సమన్వయంతో రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.