ఫార్మర్ చాట్ యాప్‌పై రైతులకు అవగాహన
ప్రకాశం: అర్థవీడు మండలం అయ్యవారిపల్లెలో రైతుల కోసం ఫార్మర్ చాట్ యాప్ పరిచయ సమావేశం నిర్వహించారు. ఉద్యాన అధికారి శ్వేత హాజరై, రైతులకు యాప్ వినియోగ విధానాన్ని, దాని ద్వారా లభించే వ్యవసాయ సలహాలు, సబ్సిడీల సమాచారాన్ని వివరించారు. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ రీజినల్ టెక్నికల్ కోఆర్డినేటర్ కమలాకర్ మైక్రోసాఫ్ట్ మద్దతుతో అమలవుతున్న ప్రాజెక్టు వివరాలను రైతులకు వెల్లడించారు.