పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు
TG: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఆర్కే 5, 6 గనుల దగ్గర కార్మికులకు పులి కనిపించింది. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పులి సంచారం గమనించారు. దీంతో సింగరేణి కార్మికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.