దసపల్లా హోటల్ నిర్మాణానికి సీఎం శ్రీకారం

దసపల్లా హోటల్ నిర్మాణానికి సీఎం శ్రీకారం

AP: రాష్ట్ర రాజధాని అమరావతిలో దసపల్లా హోటల్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. శాఖమూరులో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ నిర్మాణం జరగనుంది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, పర్యాటకం, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ అత్యాధునిక హోటల్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.