మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ
AP: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎమ్మెల్యేపై జనసేన త్రిసభ్య కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని బాధితురాలు హర్ష వీణ డిమాండ్ చేశారు. క్లీన్ చిట్ రాకుండానే ఆయన పార్టీ కండువా ఎలా కప్పుకుంటారని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతానని, తనపై దాడికి ప్రయత్నిస్తే నోటితో కాదు, చేతలతో సమాధానం చెబుతానని ఆమె హెచ్చరించారు.