గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి

ASF: జిల్లా వాంకిడి స్థానిక ఎస్బీఐ బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్న వసీం ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. కనర్గాం శివారులో పిక్నిక్‌కు వెళ్లిన వసీం ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో సహచరులు అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే వసీం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బ్యాంకు సిబ్బంది, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.