లైంగిక దాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష
NRML: ఖానాపూర్ మండలంలో మహిళపై లైంగిక దాడి చేసిన ఇద్దరు నిందితులకు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్. శ్రీవాణి 20 ఏళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధించినట్లు బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నేరం చేసినవారు శిక్ష తప్పించుకోలేరని తెలిపారు. కేసు విచారణ చేసిన పీ.పి. వినోద్ రావు, పోలీసు బృందాన్ని అభినందించారు.