VIDEO: గిద్దలూరులో మండుతున్న ఎండలు
ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గిద్దలూరు మండలంలో శుక్రవారం ఏకంగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య ఎండ ఎక్కువగా ఉండటంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పట్టణంలోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాలు జనసంచారం లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి.