రైతు బజార్ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష
కోనసీమ: అమలాపురం రైతు బజార్ వద్ద సరిహద్దు గోడ నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు రూ.51 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రైతులు వినియోగదారులు భద్రతే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.