మహానాడు సమీక్షలో ఎంపీ వేమిరెడ్డి

NLR: కడప జిల్లాలో మే నెలలో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తుంది. ఈ ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశం బుధవారం జరిగింది. టీడీపీ మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.