నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలి: కలెక్టర్

నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలి: కలెక్టర్

NLG: రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈరోజు మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసిఓలతో వివిధ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ముందుగా బ్యాగులలో మట్టి నింపడం పూర్తిచేసుకుని షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోలన్నారు.