విడవలూరులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ గ్రామంలో సీసీ రోడ్డు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డుకు ఎప్పుడో నిధులు మంజూరు అయ్యాయి. దాదాపుగా గత 45 రోజులుగా వర్షాల కారణంగా రోడ్డు పనులకు అడ్డంకిగా మారింది. వర్షాలు తగ్గడంతో ఈరోజు సీసీ రోడ్డు పనులు జేసిబితో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.