VIDEO: ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల సందడి
MDCL: ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు జరగనున్న మ్యాచ్‌తో IPL సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీ దృష్ట్యా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అభిమానులు భారీగా తరలి వస్తుండటంతో మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని కూడా పొడిగించారు.