సంపద కన్నా, ఆరోగ్యం మిన్న: డాక్టర్ దీపిక
ASF: తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపిక మాట్లాడుతూ ఎంత సంపాదించినా అనారోగ్యం పాడైతే తిరిగి ఆరోగ్యం పొందడం కష్టమని పేర్కొన్నారు. ప్రజలు పోషకాహారం తీసుకోవాలని, ఒత్తిడికి దూరంగా ఉంటూ రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.